పెళ్లి చేసుకోమని వేధిస్తున్న యువకుడిపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-11T06:52:06+05:30 IST

పెళ్లి చేసుకోమని వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఓ యువతి సర్పవరం పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేసింది.

పెళ్లి చేసుకోమని వేధిస్తున్న యువకుడిపై ఫిర్యాదు

  • సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న కానిస్టేబుల్‌పై కూడా 

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 10: పెళ్లి చేసుకోమని వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఓ యువతి సర్పవరం పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేసింది. అలాగే తన ఫొటోలను షేర్‌ చేస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్‌పై కూడా కంప్లైంట్‌ ఇచ్చినట్టు ఎస్‌ఐ ఎన.కృష్ణబాబు తెలిపారు. కాకినాడ జగన్నాథపురానికి చెందిన సంగాని పవన్‌కుమార్‌ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ క్వార్టర్‌కు చెందిన ఓ అమ్మాయిని కొంతకాలంగా పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు. అంతేకుండా సదరు యువతితో ఉన్న ఓ ఫొటోను ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు పంపించాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌ ఆ ఫొటోను మిగిలిన గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నాడు. దీంతో తనను వేధిస్తున్న యువకుడితోపాటు, తన ఫొటోలను షేర్‌ చేస్తున్న కానిస్టేబుల్‌పై కూడా చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2020-12-11T06:52:06+05:30 IST