వైభవంగా వివాహ సంస్కార మహోత్సవం

ABN , First Publish Date - 2020-12-15T06:37:54+05:30 IST

అమలాపురం శ్రీగౌతమమహర్షి గోసంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో మోబర్లీపేటలోని ఉపగోశాలలో సోమవారం వివాహ సంస్కార మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వివాహ సంస్కార మహోత్సవం
వధూవరులతో సన్నికాలు తొక్కిస్తున్న దృశ్యం

అమలాపురం టౌన్‌, డిసెంబరు 14: అమలాపురం శ్రీగౌతమమహర్షి గోసంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో మోబర్లీపేటలోని ఉపగోశాలలో సోమవారం వివాహ సంస్కార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల గాయత్రీ పరివార్‌ సభ్యులు నూకల కుమారి, పోతురాజు కనకదుర్గల ఆధ్వర్యంలో వివాహ సంస్కారం జరిపించారు. నూతన వధూవరులు వేగి కుమారసత్యనారాయణమూర్తి, శ్రీదుర్గ, అరవ కిరణ్‌కుమార్‌, లక్ష్మణశ్రావ్య దంపతులతో గ్రంథి బంధనం, పాణిగ్రహణం, ప్రతిజ్ఞ, సప్తపది వంటి కార్యక్రమాలు జరిపించారు. సంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహ సంస్కార మహోత్సవాన్ని భక్తులు అనురక్తితో వీక్షించారు. గాయత్రీ హోమం, పూర్ణాహుతి అనంతరం కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పోతురాజు వెంకటరమణకుమార్‌, కుసుమకుమారి, నరసింహారావు, పద్మ, చిక్కం గంగాసముద్రం, పార్వతి, చిక్కం ప్రసాద్‌, జయలక్ష్మి దంపతులు, ప్రముఖులు కల్వకొలను తాతాజీ, నల్లా మల్లిబాబు, నల్లా పవన్‌కుమార్‌, అయితాబత్తుల సుభాషిణి, మోకా వెంకటసుబ్బారావు తదితరులు హాజరయ్యారు. 


Read more