మరిడమ్మ దేవస్థానంలో రగడ

ABN , First Publish Date - 2020-10-27T06:15:25+05:30 IST

మరిడమ్మ దేవస్థానంలో సస్పెన్షనకు గురైన ఉద్యోగికి మద్దతుగా మిగిలిన ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. విధుల్లో అలసత్వం వహించడంతో పాటు ప్రసాదం కౌంటర్‌లో సొమ్ములు కాజేస్తున్నాడన్న అభియోగాలపై దేవస్థానంలో అటెండర్‌గా పనిచేస్తున్న బి.సురే్‌షకుమార్‌ను దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.విజయలక్ష్మి తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు.

మరిడమ్మ దేవస్థానంలో రగడ
మరిడమ్మ దేవస్థానం ఎదుట ధర్నా చేస్తున్న సిబ్బంది

  ఉద్యోగి సస్పెన్షన్‌పై ధర్నాకు దిగిన సహచరులు
 పెద్దాపురం, అక్టోబరు 26: మరిడమ్మ దేవస్థానంలో సస్పెన్షనకు గురైన ఉద్యోగికి మద్దతుగా మిగిలిన ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. విధుల్లో అలసత్వం వహించడంతో పాటు ప్రసాదం కౌంటర్‌లో సొమ్ములు కాజేస్తున్నాడన్న అభియోగాలపై దేవస్థానంలో అటెండర్‌గా పనిచేస్తున్న బి.సురే్‌షకుమార్‌ను దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.విజయలక్ష్మి తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. దీంతో సురే్‌షకుమార్‌ తనకు అన్యాయం జరిగిందని దేవస్థానం ఎదుట ఆందోళనకు దిగాడు.  అసిస్టెంట్‌ కమిషనర్‌ మానసికంగా వేధిస్తున్నారని,  ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదన్న నెపంతో విధుల నుంచి తప్పించారని ఆరోపించాడు. సురేష్‌కుమార్‌ ఆందోళనకు సహచర ఉద్యోగులు, వైసీపీ, బీజేపీ నాయకులు మద్దతు పలికారు.  కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎస్‌ఐ ఎ.బాలాజీ ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. కమిషనర్‌ విజయలక్ష్మి, దేవస్థానం ఫౌండర్‌ ట్రస్టీ డాక్టర్‌ చింతపల్లి బ్రహ్మాజీతో వైసీపీ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్‌, త్సలికి సత్యభాస్కర్‌ తదితరులు చర్చలు జరిపారు. ఉద్యోగిని నిబంధనలకు లోబడి విధుల్లోకి తీసుకునేందుకు ఆమె అంగీకరించారు.


Updated Date - 2020-10-27T06:15:25+05:30 IST