ఇదేమి పనితనం?

ABN , First Publish Date - 2020-12-19T05:42:19+05:30 IST

కొత్తపల్లి, డిసెంబరు 18: మురుగు కాలువల్లో తీసిన చెత్తతో రోడ్డు గుంతలను పూడ్చిన వైనమిది. ‘మనం-మన పరిశుభ్రత’లో భాగంగా ప్రస్తుతం

ఇదేమి పనితనం?
పొన్నాడ పల్లిపేట మెయిన్‌రోడ్డులో గోతులను చెత్తతో పూడ్చిన దృశ్యం

చెత్తతో రోడ్డు గుంతలు పూడ్చివేత

కొత్తపల్లి, డిసెంబరు 18: మురుగు కాలువల్లో తీసిన చెత్తతో రోడ్డు గుంతలను పూడ్చిన వైనమిది. ‘మనం-మన పరిశుభ్రత’లో భాగంగా ప్రస్తుతం వ్యర్థాలపై పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పొన్నాడ పంచాయతీ పరిధిలోని పల్లిపేటలో కాలువల్లో పూడిక తీసిన చెత్త, మురుగు మట్టితో మెయిన్‌రోడ్డులో పడిన గుంతలను పూడ్చారు. నాగులాపల్లి, మాదాపురం మీదుగా పిఠాపురం వెళ్లే రహదారి గోతుల్లో చెత్త వేసి పూడ్చడంపై గ్రామస్థులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

Read more