కాలువలో స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2020-10-19T07:27:13+05:30 IST

పంట కాలువలో స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన తమ్మవరంలో ఆదివారం సాయంత్రం జరిగింది. తిమ్మాపురం ఇన్‌చార్జి ఎస్‌ఐ సత్తిబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి... కాకినాడ రూరల్‌ మండలం తమ్మవరానికి చెందిన మంచింశెట్టి వెంకటరమణ(59) మెయిన్‌రోడ్డులో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద వరి పొలాలకు ప్రధానంగా సాగునీరందించే పంట కాలువలోకి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్నానానికి దిగాడు.

కాలువలో స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతు

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 18: పంట కాలువలో స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన తమ్మవరంలో ఆదివారం సాయంత్రం జరిగింది. తిమ్మాపురం ఇన్‌చార్జి ఎస్‌ఐ సత్తిబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి... కాకినాడ రూరల్‌ మండలం తమ్మవరానికి చెందిన మంచింశెట్టి వెంకటరమణ(59) మెయిన్‌రోడ్డులో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద వరి పొలాలకు ప్రధానంగా సాగునీరందించే పంట కాలువలోకి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్నానానికి దిగాడు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహానికి కాలువలో వెంకటరమణ గల్లంతయ్యాడని, ఆచూకీ కోసం కాలువ చివర వరకు గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యుడు నారాయణ తిమ్మాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కాలువలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదని, చీకటి పడడంతో గాలింపు కష్టంగా మారడంతో సోమవారం గాలింపు కొనసాగిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-10-19T07:27:13+05:30 IST