కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.. ఫలితం చూసి.. ఫోన్ మాట్లాడుతూ టెన్షన్‌లో..

ABN , First Publish Date - 2020-04-25T17:30:17+05:30 IST

కరోనా పరీక్షల ఫలితం తెలుసుకోవడానికి వచ్చిన ఒక మునిసిపల్‌ ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో

కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.. ఫలితం చూసి.. ఫోన్ మాట్లాడుతూ టెన్షన్‌లో..

కరోనా టెస్ట్‌ ఫలితం టెన్షన్‌లో మునిసిపల్‌ ఉద్యోగి మృతి 

మృతుడు రామచంద్రపురం మునిసిపాలిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌


రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి జిల్లా): కరోనా పరీక్షల ఫలితం తెలుసుకోవడానికి వచ్చిన ఒక మునిసిపల్‌ ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కె.నరసింహమూర్తి (38) తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మునిసిపాలిటీలో సీనియర్‌ అస్టిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు ఆయన రోజూ కొవ్వూరు నుంచి రామచంద్రపురం వెళతాడు. గురువారం రాజమహేంద్రవరం ఆసుపత్రికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టు కోసం మరుసటి రోజు రమ్మని వైద్యులు చెప్పారు. దీంతో మూర్తి శుక్రవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చాడు. రిపోర్టు నెగిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలియజేశారు. బయటకు వస్తూ ఫోను మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడున్న వారు వెంటనే వైద్యులను పిలిచారు. వైద్యులు వచ్చి పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి బంధువులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - 2020-04-25T17:30:17+05:30 IST