మైనార్టీల అభివృద్ధి ప్రభుత్వానికి ఇష్టం లేదు
ABN , First Publish Date - 2020-12-01T06:52:17+05:30 IST
: మైనార్టీల అభివృద్ధి జగన్ ప్రభుత్వానికి ఇష్టం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు.
కార్పొరేషన్ వద్ద టీడీపీ నేతల ధర్నా
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 30: మైనార్టీల అభివృద్ధి జగన్ ప్రభుత్వానికి ఇష్టం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంవద్ద మైనార్టీల సంక్షేమం కోసం గతంలో జారీ చేసిన జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీనవీన్‌కుమార్, మైనార్టీ నాయకులు చాన్‌బాషాలు హాజరయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన మైనార్టీలకు సంబంధించిన జీవోలను అమలు చేయాలని కోరుతూ కమిషనర్ అభిషిక్త్ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మైనార్టీలపై జగన్ ప్రభుత్వం చులకనగా చూస్తోందని మండిపడ్డారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో షాదిఖానాల అభివృద్ధికి, మసీదుల అభివృద్ధికి మైనార్టీ వెల్ఫేర్ శాఖ నుంచి నిధులు మంజూరుకాగా వాటిని ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. మైనార్టీ నాయకులు షేక్ సుభాన్ మాట్లాడుతూ రెహ్మత్ నగర్ షాదీఖానా నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఈ నిరసనలో మైనార్టీ నాయకులు మహబూబ్ జానీ, ఎస్‌ఏజీ షహీద్, అమీర్ ఫాషా, రఫీ, అజీజ్, ఎస్‌కె హుస్సెన్, ఫరీఫ్, సయ్యద్ అప్సర్, గౌస్ జానీ, మాజీ కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్, కడలి రామకృష్ణ, బెజవాడ రాజ్‌కుమార్, తంగెళ్ళ బాబి, సింహ నాగబాబు, నాయకులు రవియాదవ్, మజ్జి పద్మ, తురకల నిర్మల, గరగ మురళీ, కరగాని వేణు, అగురు ధనరాజు, కడితి జోగారావు, మజ్జి రాంబాబు పాల్గొన్నారు.