మహాత్ముడి ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2020-10-03T06:24:10+05:30 IST
మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం/సామర్లకోట, అక్టోబరు 2: మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ పార్క్‌లో, సామర్లకోట గాంధీ బొమ్మ విగ్రహం వద్ద మహాత్ముడి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికి అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాలను అం దించిన గాంధేయ మార్గం ఆదర్శప్రాయం, అనుసరణీయమని అన్నారు.
సర్పవరం జంక్షన్: రమణయ్యపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి ఎంపీడీవో, జడ్పీ ఇన్‌చార్జి సీఈవో పి.నారాయణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సూపరింటెండెంట్ శ్రీని వాస్, ఈవోపీఆర్డీ బి.గోవిందరాజులు, కార్యదర్శి ఎన్.వెంకటరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి తహశీల్దార్ వేముల మురళీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పవరం భావనారాయణపురం గాంధీనగర్‌లో పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల చందు ఆధ్వర్యంలో, రమణయ్యపేట బోట్ క్లబ్‌లో వాకర్స్ జిల్లా గవర్నర్ అడబాల రత్నప్రసాదరావు ఆధ్వర్యం లో గాంధీ జయంతి నిర్వహించారు.
వాకలపూడిలో ఉమా మనో వికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహూదూర్‌శాస్త్రి జయంతి జరిపారు. రమణయ్యపేట శివారు రాయుడుపాలెంలోని బీజేపీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు కాళ్ల ధనరాజు ఆధ్వర్యం లో గాంధీ జయంతి నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు సీహెచ్ రామ్‌కుమార్, నేతలు బొలిశెట్టి రామకృష్ణ, మామిడాల శ్రీనివాసరావు, పెండెం బాబ్జీ, అనపర్తి వెంకటేష్, విజయరామయ్య, శ్రీహరిరావు పాల్గొన్నారు.
జగ్గంపేట/జగ్గంపేట రూరల్: స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్యే జోతుల నెహ్రూ, జడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ విచ్చేసి మహాత్ముడికి నివాళులర్పించారు. పార్టీ నాయకులు మారిశెట్టి భద్రం, జీనుమణిబాబు, కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, చెలికాని హరిగోపాల్ పాల్గొన్నారు. జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం వాసవిక్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కంచర్లబాబు, మానేపల్లి బంగార్రాజు, కొత్త రాము, బొండ వీరసత్య, వి.వీరేశ్వరరావు, వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తోలేటి సూర్యనారాయణ, చంద్రమౌళి వెంకటశాస్త్రి, సమ్మిట సాయిరామ్, మలేశ్వరరావు మాస్టారు తదితరులు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.
గండేపల్లి: గండేపల్లిలో వాసవి క్లబ్ సభ్యుల అధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సూరంపాలెం ఆదిత్య కళాశాలలో గాంధీ జయంతిని నిర్వహించారు.
పిఠాపురం: స్థానిక పురపాలకసంఘ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి మునిసిపల్ కమిషనరు సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్డు సచివాలయాల్లో గాంధీ జయంతి జరిగింది. ఉప్పాడ సెంటర్‌లో గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ ఎల్లప్పుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని వర్మ అన్నారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గండేపల్లి బాబి, బొజ్జా రామయ్య, పెండెం రఘు తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేయగా ఉప్పాడ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యనారాయణ, చింతపల్లి పద్మారెడ్డి, తోట ఏడుకొండలు, బిళ్లకుర్తి రామేశ్వరరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గొల్లప్రోలు: గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనరు సాయిబాబు, మేనేజరు జయకర్ తదితరులు, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు వి.అమ్మాజీ, డీటీ వెంకటేశ్వరరావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో హరిప్రియ తదితరులు గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పిఠాపురం రూరల్: పిఠాపురం మండలం కందరాడలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్‌బహూదూర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మండలాధ్యక్షుడు పిల్లా ముత్యాలరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బుర్ర కృష్ణంరాజు, గండి కొండలరావు, రామ తులసీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పి.వసంతమాధవి, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ ఎల్.శివకుమార్, పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐ బొజ్జా లోవరాజు గాంధీజీకి నివాళులర్పించారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బీజేపీ ఇన్‌చార్జి బుర్రి కష్ణంరాజు, బిళ్ళకుర్తి రామేశ్వరరెడ్డి, వాకతిప్పలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, కొత్తపల్లిలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు, శొంఠివారిపాకల్లో గీత కార్మికసంఘ నాయకుడు వెంగలి సుబ్బారావు, వైసీపీ మండలాధ్యక్షుడు ఆనాల సుదర్శన్, కొండెవరంలో గాది మాణిక్యం ఫౌండేషన్ చైర్మన్ గంగబాబు,కొత్తపల్లి ఊరచెరువు సెంటర్లో ఏఐసీసీ సభ్యుడు ఓలేటి రాయభాస్కరరావు మహాత్మ గాంధీ చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించారు. గ్రామస్థులకు స్వీట్లు పంపణీ చేశారు.
రౌతులపూడి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌వీ నాయుడు గాంధీజీకి నివాళులర్పించారు. దేశం కోసం పోరాటం చేసిన వారిని ఎల్లప్పడు స్మరించుకోవాలన్నారు. యువత గాంధీజీ ఆశయాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీల్లో గాంధీ జయంతిని నిర్వహించారు.
తొండంగి: స్థానిక మండల పరిషత్ కార్యలయంలో ఎంపీడీవో సతీష్, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ చిన్నారావు, పోలీస్‌స్టేషన్‌తో పాటు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గాంధీ వేడుకలను నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కోడ వెంకటరమణ, సమన్వయకర్త పేకేటి హరికృష్ణ, మురాలశెట్ట సత్యనారయణ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
తుని: తుని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర యువజన పార్టీ నాయకుడు మోతుకూరి వెంకటేష్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు పోతుల లక్షణ్, నియోజకవర్గం యువత అధ్యక్షుడు ఏలూరి బాలు తదితరులు గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల రాజా, నాయకులు కొమ్ముల కన్నబాబు, పైలా బోసు, రాజాల చిట్టిబాబు గాంధీజి చిత్రపటానికి నివాళులర్పించారు. ధర్మవరం గ్రామసచివాలయం వద్ద ఎంపీడీవో డి.శ్రీలలిత, ఈవోపీఆర్డీ రామకృష్ణారెడ్డి, కార్యదర్శి బి.శ్రీనివాస్, జువ్వల రామాలయం వద్ద సొసైటీ అధ్యక్షుడు జువ్వల కొండలరావు తదితరులు గాంధీజీకి నివాళులర్పించారు. ప్రత్తిపాడు ఏగులమ్మగుడి సెంటర్లో వైసీపీ నాయకులు బెహర దొరబాబు, ఆకుల వీరబాబు తదితరులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పీసీసీ సభ్యుడు ధరణాలకోట శ్రీను గాంధీజీకి నివాళులర్పించారు. బీజేపీ, బార్ కార్యాలయాల వద్ద గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు బీజేపీ నాయకులు సింగిల్‌దేవి సత్తిరాజు, మదినే బాబ్జి, బుగత శివ తదితరులు నివాళులర్పించారు.
కాకినాడ: ఎన్జీవో హోంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలో ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎండీ జియాఉద్దీన్, నగర అధ్యక్షుడు పి.మూర్తిబాబు, సభ్యులు టి.వెంకటర మణ, కె.అనురాధ, వర్మ, అజీజ్, రెడ్డి పాల్గొన్నారు. రామరావుపేటలోని ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డి.వెంకటరావు అధ్యక్షతన నివాళి సభ ఏర్పాటు చేశారు. అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉన్న ఆశ్రమానికి వెళ్లి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సంఘ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి. సుబ్బరాజు, రాష్ట్ర కన్వీనర్లు ఎం.శ్రీను, వి.పళ్లంరాజు, ఎన్.వెంకటరాజు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మహర్షి సాంబమూర్తి విభిన్న ప్రతిభావంతుల బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలో బాపూజీకి రెడ్‌క్రాస్ చైర్మన్ యార్లగడ్డ దశరథ రామా రావు (వైడీఆర్) నివాళులర్పించారు. ఆశ్రమం అధ్యక్షుడు మహ్మద్ జవహర్ అలీ, ఉపాధ్యక్షుడు సయ్యద్ సాలార్, సభ్యులు షిర్గీ జవహర్, వాసా సత్యనారాయణ, అల్లూరి సురేంద్ర పాల్గొన్నారు.
డెయిరీఫారమ్ సెంటర్: మహాత్మాగాంధీ, లాల్‌బహుదూర్‌శాస్త్రి జయం తిలను డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ, నాయకులు, కార్యకర్తలు గాంధీజీ, శాస్త్రీజీల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దాడ సుబ్బారాయుడు, సబ్బతి ఫణేశ్వరరావు, కోలా ప్రసాదవర్మ, బాబిబోయిన వెంకటేష్‌నాయుడు, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి ఆ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. కార్పొరేటర్లు రోకళ్ల సత్యనారాయణ, వాసిరెడ్డి రాంబాబు, సంగాని నందం, చవ్వాకుల రాంబాబు, కోరుమిల్లి బాలప్రసాద్, జేడీ పవన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణు, త్రిపురసుందరి ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ పాల్గొన్నారు.
భానుగుడి (కాకినాడ): గాంధీ జయంతి సందర్భంగా జమాతే ఇస్లామీ హిందూ మహిళా సంఘ్ విభాగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్‌లో గాంధీ విగ్రహం వద ్ద నివాళులర్పించారు.
కరప: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో స్వప్న, ఏవో భీమశంకరరావు, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఉదయభాస్కర్, డీటీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ మాచరరావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ దానేటి రామారావు, ప్రభుత్వాసుపత్రుల్లో మండల వైద్యాధికారులు శ్రీనివాసనాయక్, సౌజన్య, ఆయా గ్రామాల్లో ప్రత్యేకాధికారులు ఎంఈవో కొప్పుల బులికృష్ణవేణి, ఏవో గాయత్రీదేవి, ఏడీ వెటర్నరీ సురేష్‌బాబు, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ రంజిత్‌సింగ్, ఈవోపీఆర్డీ బాలాజీవెంకటరమణ, పంచాయతీల కార్యదర్శులు గాంధీజీ, శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో పీఏసీఎస్ చైర్మన్ చీకాల అప్పలరాజు, వైసీపీ మండలాధ్యక్షుడు చింతా ఈశ్వరరావు, బీజేపీ మండలాధ్యక్షుడు రెడ్డి రమణేశ్వర్, నాయకులు చీకాల సుబ్బారావు, రొక్కాల గణేష్, పబ్బినీడి పాపారావు, రెడ్డిపల్లి రమేష్ తదితరులు గాంధీజీ, శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు.
జేఎన్టీయూ (కాకినాడ): మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ సీహెచ్ సత్యనారాయణ సూచించారు. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా వర్శిటీలో ఆయన చిత్రపటానికి రిజిస్ట్రార్ పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ బాలకృష్ణ, డాక్టర్ బీఆర్ దొరస్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దాపురం: వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించారు.ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి గాంధీ, లాల్‌బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమహేశ్వరి, సూపరింటెండెంట్ వీరేశ్వరపు శ్రీనివాస్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు జగన్నాథం, నాగమణి పాల్గొన్నారు. మండలంలోని కట్టమూరులోని సచివాలయంలో, మన పెద్దాపురం ఫేస్‌బుక్ టీమ్ ఆధ్వర్యంలో మహాత్ముడికి నివాళులర్పించారు.
సామర్లకోట: స్థానిక మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ సచివాలయంలో జరిగిన కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, డీఈ చదలవాడ రామారావు పాల్గొని మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించారు. వైసీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ దవులూరి దొరబాబు స్టేషన్‌సెంటర్, మండలం లోని మాధవపట్నంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మహాత్ముడికి నివాళులర్పించారు. ఈవోపీఆర్డీ కేవీ సూర్యనారాయణ, గ్రామ కార్యదర్శి శ్రీహరి, మేడిశెట్టి వీరభధ్రం తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి క్లబ్ ప్రతినిధులు కటకం రత్నకుమారి, గుడిమెట్ల సమత, కంచర్ల అనిత, పూర్వపు రీజనల్ చైర్మన్ కటకం హైమావతి నివాళులర్పించారు.
అన్నవరం: స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ కార్యదర్శి రాం శ్రీనివాస్ గాంధీజీకి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో దారా వెంకటరమణ, శెట్టిబత్తుల కుమారరాజా, దడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాహనాల సత్రం వద్ద బాపుజీ విగ్రహానికి క్లబ్ అధ్యక్షుడు బోనగిరి శ్రీనివాసు, ఉద్దగిరి చలమరాజు, దాసరి ప్రసన్న నివాళులర్పించారు.