మహిళ దీక్షపై స్పందించిన అధికారులు

ABN , First Publish Date - 2020-12-20T05:38:24+05:30 IST

జగ్గంపేట/జగ్గంపేట రూరల్‌, డిసెంబరు 19: ప్రియుడి చేతిలో మోసపోయి మూడు రోజులుగా మౌనదీక్ష చేస్తున్న వివాహితతో అధికారులు చర్చలు జరిపారు. మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన పీసా రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మొహం చాటేయడంతో అతడి

మహిళ దీక్షపై స్పందించిన అధికారులు
బాధితురాలితో మాట్లాడుతున్న అధికారులు

జగ్గంపేట/జగ్గంపేట రూరల్‌, డిసెంబరు 19: ప్రియుడి చేతిలో మోసపోయి మూడు రోజులుగా మౌనదీక్ష చేస్తున్న వివాహితతో అధికారులు చర్చలు జరిపారు. మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన పీసా రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మొహం చాటేయడంతో అతడి ఇంటి ముందే ఓ మహిళ మౌనదీక్ష చేపట్టింది. దీంతో కాకినాడ దిశా వన్‌స్టా్‌ప పోలీసులు, ఐసీడీఎస్‌, రెవెన్యూ యంత్రాంగం అక్కడికి చేరుకుని బాధితరాలు, రామకృష్ణ కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాధిత మహిళకు గతంలో పెళ్లైందని అతడికి విడాకులు ఇస్తే తమకు అభ్యంతరం లేదని రామకృష్ణ తల్లిదండ్రులు అధికారులకు తెలిపారని తహశీల్దార్‌ సరస్వతి చెప్పారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, వెంటనే రామకృష్ణతో పెళ్లి జరిపించాలని అధికారులను బాధిత మహిళ కోరింది. కార్యక్రమంలో దిశా వన్‌స్టా్‌ఫ సెంటర్‌ పీఎ్‌ఫవో కేఎస్‌ చంద్ర, బీవీవీ లక్ష్మీదేవి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు యు.పద్మ, వరలక్ష్మి, ఆర్‌ఐ స్వరూప ప్రియదర్శి, వీఆర్వో రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:38:24+05:30 IST