అతివేగానికి మూగజీవాలు బలి

ABN , First Publish Date - 2020-12-28T05:54:09+05:30 IST

గ్రావెల్‌ లారీ వేగం రెండు మూగ జీవాలను పొట్టన పెట్టుకుంది. కత్తిపూడి గ్రామ శివారులో పొలం పనులకు వెళుతున్న ఎద్దుల బండిని గ్రావెల్‌ లారీ బలంగా ఢీకొట్టింది.

అతివేగానికి మూగజీవాలు బలి
చనిపోయిన ఎద్దులు

శంఖవరం, డిసెంబరు 27: గ్రావెల్‌ లారీ వేగం రెండు మూగ జీవాలను పొట్టన పెట్టుకుంది. కత్తిపూడి గ్రామ శివారులో పొలం పనులకు వెళుతున్న ఎద్దుల బండిని గ్రావెల్‌ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతిచెందాయి.  లారీ ఆగకుండా ముందుకు వెళ్లడంతో వాహనదారులు, గ్రామస్థులు వెంబడించి పట్టుకున్నారు. బండి యజమాని ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

Updated Date - 2020-12-28T05:54:09+05:30 IST