స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను అరికట్టాలి

ABN , First Publish Date - 2020-03-13T09:12:18+05:30 IST

దౌర్జన్యాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనుకోవడం అనాగరిక చర్య అని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. టీడీపీ శ్రేణులపై జరుగుతున్న

స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను అరికట్టాలి

కాకినాడ క్రైం, మార్చి 12: 

దౌర్జన్యాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనుకోవడం అనాగరిక చర్య అని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని గురువారం ఆయన ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీకి వినతిపత్రం అందించారు.  అనంతరం రాజప్ప మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని దౌర్జన్యాలకైనా పాల్పడి గెలవాలని వైసీపీ కంకణం కట్టుకుందన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావుపై దాడి ఆ కోవకు చెందిందేనని చెప్పారు. 


నామినేషన్ల చించివేత, అభ్యర్థుల కిడ్నాప్‌లు యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు.  జిల్లాలో కూడా టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట తొండంగి మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కోడా వెంకటరమణ, కోటనందూరు జడ్పీటీసీ అభ్యర్థి లెక్కల సన్యాసమ్మ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-03-13T09:12:18+05:30 IST