-
-
Home » Andhra Pradesh » East Godavari » Liquor store theft
-
మద్యం దుకాణంలో చోరీ
ABN , First Publish Date - 2020-10-07T08:20:42+05:30 IST
కాకినాడ ఎల్‌బీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడి సుమారు రూ.2,66,650 నగదు, రెండు మద్యం ఫుట్ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు...

రూ.2.66 లక్షల నగదు,
రెండు ఫుల్ బాటిళ్ల అపహరణ
సర్పవరం జంక్షన్, అక్టోబరు 6: కాకినాడ ఎల్‌బీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడి సుమారు రూ.2,66,650 నగదు, రెండు మద్యం ఫుట్ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు సర్పవరం సీఐ ఆర్. గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడియల్ కాలేజీ కెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణానికి మంగళవారం రాత్రి సూపర్‌వైజర్, సిబ్బంది తా ళాలు వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం సిబ్బంది వచ్చి పరిశీలించగా షాపు ఇనుప షట్టర్లు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. మద్యం దుకాణం వెనుక భాగాన ఏర్పాటు చేసిన రేకు తలుపు తాళాలు బద్ధలు కొట్టి తలుపు తీసి ఉండటంతో సూపర్‌వైజర్, సిబ్బంది మద్యం దుకాణంలోకి వెళ్లి పరిశీలించారు. అయితే నగదు, రెండు మద్యం బాటిల్స్ కని పించలేదు. దీంతో సూపర్‌వైజర్ కొర్రా మణికంఠ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణబాబు తెలిపారు.