పుంజుకున్న రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-12-11T06:03:44+05:30 IST

కరోనా సమయంలో మందగించిన భూ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు పుంజుకున్నాయని రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ జిల్లా డీఐజీ జి.బాలకృష్ణ చెప్పారు.

పుంజుకున్న రిజిస్ట్రేషన్లు

మండపేట, డిసెంబరు 10: కరోనా సమయంలో మందగించిన భూ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు పుంజుకున్నాయని రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ జిల్లా డీఐజీ జి.బాలకృష్ణ చెప్పారు. మండపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ల పరిధిలో 2020-21లో రూ.795 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నవంబరు నెలాఖరుకు రూ.509 కోట్లు లక్ష్యం కాగా రూ.345 కోట్లు వచ్చిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన మొత్తాన్ని పూర్తి చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్లు ఏ మేరకు అవుతున్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.  డీఐజీ వెంట సబ్‌ రిజిస్ట్రార్‌ నరసింహారావు ఉన్నారు. 

Updated Date - 2020-12-11T06:03:44+05:30 IST