భూ సేకరణ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-06-18T10:22:36+05:30 IST

ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని, సేకరించిన స్థలాల్లో త్వరితగతిన లే అవుట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

భూ సేకరణ వేగవంతం చేయాలి

కొత్తపల్లి, జూన్‌ 17: ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని, సేకరించిన స్థలాల్లో త్వరితగతిన లే అవుట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. కొమరగిరిలో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను మెరకచేసే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. కాకినాడ అర్బన్‌ ప్రజలకు కొమరగిరిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.


ఇప్పటికే జిల్లాలో సేకరించిన భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన లే అవుట్లు, మెరక పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మండలంలో మెరక చేసిన స్థలాల్లో త్వరితగతిన లే అవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్ల విభజన పూర్తిచేయాలని, లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ వెంట కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, కొత్తపల్లి తహశీల్దార్‌ ఎల్‌.శివకుమార్‌, ఎంపీడీవో పి.వసంతమాధవి ఉన్నారు.

Updated Date - 2020-06-18T10:22:36+05:30 IST