శాస్త్రీజీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-10-03T07:44:28+05:30 IST

జై జవాన్‌, జై కిసాన్‌ నినాదంతో అందరికీ అన్నం పెట్టే రైతు ప్రాధాన్యాన్ని, దేశానికి రక్షణగా నిలిచే సైనికుడు గొప్పతనాన్ని దివంగత

శాస్త్రీజీకి ఘన నివాళి

కాకినాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జై జవాన్‌, జై కిసాన్‌ నినాదంతో అందరికీ అన్నం పెట్టే రైతు ప్రాధాన్యాన్ని, దేశానికి రక్షణగా నిలిచే సైనికుడు గొప్పతనాన్ని దివంగత ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి చాటి చెప్పారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెద్దిరెడ్డి రవికిరణ్‌ ఆయన ఔన్నత్యాన్ని కొనియాడారు. శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం కాకినాడలోని కొత్తపేట మార్కెట్‌ సమీపంలోగల శాస్త్రి సెంటర్‌లో ఏర్పాటు చేసిన నివాళి సభలో రవికిరణ్‌ పాల్గొని ఆయన విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైతిక ధర్మాచరణ, దృఢ సంకల్పంతో ప్రజాపయోగమైన నిర్ణయాలతో స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందించిన శాస్త్రిని అజాతశత్రు వుగా అభివర్ణించారు. కార్యక్రమంలో కార్యకర్తలు ఉదయ్‌స్వామి, పి.చెరియన్‌, బీరక అప్పారావు, చక్క రమేష్‌, సత్తి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-03T07:44:28+05:30 IST