కొవిడ్‌ బాధిత ఉద్యోగులకు సెలవులివ్వాలి

ABN , First Publish Date - 2020-10-08T07:51:21+05:30 IST

కొవిడ్‌-19 బారినపడిన ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చేయాలని ధర్నా నిర్వహించారు...

కొవిడ్‌ బాధిత ఉద్యోగులకు సెలవులివ్వాలి

అమలాపురం టౌన్‌, అక్టోబరు 7: కొవిడ్‌-19 బారినపడిన ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చేయాలని నేష నల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో బుధవారం అమలాపురం ప్రధాన తపాలా కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా  తపాలా ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి కె.మధు సూదనరావు మాట్లాడుతూ కొవిడ్‌తో కొం దరు ఉద్యోగులు మృతి చెందారని,  వారి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయంగా ఇన్సూరెన్సు సహాయం అందించాలని కోరారు. కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌లో విధులు నిర్వహించిన కార్మికులు, ఉద్యో గులకు వెంటనే వేతనాలు మంజూరు చేయాలన్నారు. పోస్టల్‌ కార్యాలయాల మూసివేత, విలీన ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండు చేశారు. హెడ్‌పోస్టు మాస్టర్‌ ఎం.రవికుమార్‌, గ్రామీణ తపాలా ఉద్యోగుల కార్య దర్శి వీవీ రామకృష్ణ, వై.విఠోభరావు, సీహెచ్‌వీ.సతీష్‌, బి.వెంక టేష్‌, కేఎస్వీ.సుబ్బా రావు, డీవీ.శర్మ, బి.ప్రవీణ్‌, ఎ.వెంకటే శ్వర్లు, కేపీఎస్‌ఆర్‌ఎస్‌ ఆచార్యులు, వి.శ్రీరాములు  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-08T07:51:21+05:30 IST