కోటిపల్లిలో ఎన్జీటీ బృందం పర్యటన
ABN , First Publish Date - 2020-12-11T05:46:39+05:30 IST
మండలంలోని కోటిపల్లి గోదావరి నది, ఇసుక ర్యాంపులను, రైల్వే వంతెన నిర్మాణ పనులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యురాలు మహిమ ఆధ్వర్యంలోని బృందం గురువారం పరిశీలించింది.
- గోదావరి నది, రైల్వే వంతెన, ఇసుక తవ్వకాల పరిశీలన
కె.గంగవరం, డిసెంబరు 10: మండలంలోని కోటిపల్లి గోదావరి నది, ఇసుక ర్యాంపులను, రైల్వే వంతెన నిర్మాణ పనులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యురాలు మహిమ ఆధ్వర్యంలోని బృందం గురువారం పరిశీలించింది. వంతెన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ఉపయోగిస్తున్న ఇసుక, వాటికి సంబంధించిన అనుమతుల గురించి మైన్స్, ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోటిపల్లి ఫెర్రీ రేవు నుంచి అవతల ఒడ్డుకు వెళ్లి అక్కడ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఆర్డీవో గాంధీ, తహశీల్దార్ జీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.