కోటిపల్లి ఫెర్రీ వేలం ఖరారు

ABN , First Publish Date - 2020-10-29T05:27:02+05:30 IST

కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ వేలం రూ.23,23,900కు ఖరారైంది. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం బహిరంగ వేలం, సీల్డ్‌ టెండర్లు విధానంలో పాట నిర్వహించారు.

కోటిపల్లి ఫెర్రీ వేలం ఖరారు

కె.గంగవరం, అక్టోబరు 28: కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ వేలం రూ.23,23,900కు ఖరారైంది. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం బహిరంగ వేలం, సీల్డ్‌ టెండర్లు విధానంలో పాట నిర్వహించారు. పాటకు సంబంధించి ప్రభుత్వ ధర రూ.23,14,815గా ఎంపీడీవో వి.అబ్రహం లింకన్‌ ప్రకటించారు. సీల్డ్‌ టెండర్ల ద్వారా శ్రీ వెంకటేశ్వర ఆల్‌ క్యాస్ట్‌ క్వారీ అండ్‌ బోట్స్‌మెన్‌ లేబర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ప్రతినిధి బిక్కిన దుర్గారావు రూ. 23,23,900లకు పాటను కైవసం చేసుకున్నారు. ఈ వేలంలో మరో పాటదారుడు యర్రంశెట్టి వీరభద్రరావు రూ.23,22,000కు కోడ్‌ చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ జీవీ ప్రసాద్‌, ఎంపీడీవో వి.అబ్రహం లింకన్‌, జిల్లా పరిషత్‌ ఆర్‌వో సీహెచ్‌ఎస్‌ శాసి్త్ర, మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ వి.డి.రత్నకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-10-29T05:27:02+05:30 IST