కొత్తపేటలో భారీ చోరీ

ABN , First Publish Date - 2020-11-25T06:27:33+05:30 IST

కొత్తపేట మెయిన్‌రోడ్డులో కెనరా బ్యాంకు సమీపంలో ఓ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొత్తపేటలో భారీ చోరీ

కేజీన్నర వెండి.. రెండు కాసులు బంగారం మాయం

కొత్తపేట,  నవంబరు 24: కొత్తపేట మెయిన్‌రోడ్డులో కెనరా బ్యాంకు సమీపంలో ఓ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆకెళ్ల వెంకటసాయి సుబ్రహ్మణ్య వంశీ తమ కుటుంబసభ్యులతో కలిసి ఈనెల2న హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లాడు. మళ్లీ 23వ తేదీ రాత్రి తిరిగి వచ్చారు. ఇంటి వెనుకవైపు తలుపు ధ్వంసమై ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా కేజీన్నర వెండి, సుమారు 2కాసులు బంగారు వస్తువులు కనిపించలేదు. దీనిపై బుధవారం కొత్తపేట పోలీసులకు వంశీ ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ కె.రమేష్‌ సంఘటనాస్థలానికి వెళ్లి కాకినాడ నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.


Read more