ఆయిల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు
ABN , First Publish Date - 2020-10-03T06:04:17+05:30 IST
అక్రమంగా అయిల్ తరలిస్తున్న ముఠాను కోటనం దూరు పోలీసులు అరెస్ట్‌చేశారు. గురువారం అర్ధరాత్రి విశాఖ జిల్లా పరవాడ నుంచి ఐషర్
ఏడుగురు నిందితుల అరెస్టు, పదివేల లీటర్ల స్వాధీనం
కోటనందూరు, అక్టోబరు 2: అక్రమంగా అయిల్ తరలిస్తున్న ముఠాను కోటనం దూరు పోలీసులు అరెస్ట్‌చేశారు. గురువారం అర్ధరాత్రి విశాఖ జిల్లా పరవాడ నుంచి ఐషర్ వ్యాన్‌లో పదివేల లీటర్ల అయిల్‌ను ప్రత్తిపాడు ఏరి యాకు తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో తుని రూరల్ సీఐ కిషోర్‌బాబు అధ్వర్యంలో ఏఎస్‌ఐ నాగేశ్వరరావు బృందం మాటువేసి పట్టుకున్నారు. అందులో పెట్రోల్ వంటి ప్రమాదకరంగా ఉండే 10వేల లీటర్లు ఆయిల్‌ను ఐషర్ వ్యాన్‌తోపాటు, ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ప్రత్తిపాడు మండలం ఉద్దండ జగన్నాథపురానికి చెందిన గాది తాతాజీ, కడిమి హరికృష్ణ, వట్టికోళ్ల శ్రీరామశివ, వట్టికోళ్ల దివాణం, వట్టికోళ్ల స్వామి, అగంనం పూడి శ్రీను, తాతాజీని అరెస్టు చేసినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.