-
-
Home » Andhra Pradesh » East Godavari » korukonda temple second rout serway
-
కోరుకొండకు రెండవ మెట్ల దారికి సర్వే
ABN , First Publish Date - 2020-12-27T06:41:01+05:30 IST
చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కోరుకొండ కొండకు సుమారు 900 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మెట్ల దారికి అనుబంధంగా మరో కొత్తదారి ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే రాజా కృషితో శనివారం సర్వే పను లు చేపట్టారు.

కోరుకొండ, డిసెంబరు 26 : చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కోరుకొండ కొండకు సుమారు 900 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మెట్ల దారికి అనుబంధంగా మరో కొత్తదారి ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే రాజా కృషితో శనివారం సర్వే పను లు చేపట్టారు. 650 అడుగలపైగా ఎత్తుగల ఈ కొండకు ఇరుకైన ఒకే మెట్లదారి ఉండడంవల్ల భక్తులు కొండపైకి వెళ్లడానికి కిందకు దిగడానికి ఒకే మార్గం ఉండడంతో ముఖ్యమైన పర్వదినాల్లో తొక్కిసలాట జరుగుతుంది. దీన్ని నివారించేందుకు కొండపైకి వెళ్లిన భక్తులు వేరే మార్గం ద్వారా కిందకు దిగేందుకు అనువుగా రెండవ మెట్ల దారి నిర్మాణానికి సర్వే చేస్తున్నామని ఎండోమెంట్ అధికారులు తెలిపారు.