-
-
Home » Andhra Pradesh » East Godavari » konaseea nrusimha japa yagnam
-
కోనసీమవ్యాప్తంగా నృసింహ జప యజ్ఞం
ABN , First Publish Date - 2020-12-10T05:53:48+05:30 IST
అంతర్వేది దేవస్థానం సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కోనసీమవ్యాప్తంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి జప యజ్ఞం నిర్వహిస్తున్నట్టు సమితి ప్రతినిధి బొక్కా సాంబశివరావు సిద్థాంతి తెలిపారు.

అమలాపురం రూరల్, డిసెంబరు 9: అంతర్వేది దేవస్థానం సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కోనసీమవ్యాప్తంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి జప యజ్ఞం నిర్వహిస్తున్నట్టు సమితి ప్రతినిధి బొక్కా సాంబశివరావు సిద్థాంతి తెలిపారు. భట్నవిల్లిలోని శ్రీలలిత జ్యోతిషాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో విజయదశమి రోజున జపయజ్ఞాన్ని ప్రారంభించామన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో జప యజ్ఞం, పూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు. స్వామివారి కల్యాణం రోజు వరకు 270 గ్రామాల్లో దేవాలయాల వద్ద జప యజ్ఞం నిర్వహిస్తామన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండు చేశారు. దేవస్థానం భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ధార్మిక సంస్థల ప్రతినిధులకు దేవాలయ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. సమావే శంలో సభ్యులు గొవ్వాల జానకినాగరాజు, ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, నక్కా కేశవరావు, దొమ్మేటి ప్రభాకర్, గొవ్వాల అచ్చుతరామయ్య, హరిబాబు, ప్రకాష్, కె.సత్యబాబ్, బి.కృష్ణపార్థు, డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.