కొమరగిరి లేఅవుట్ అభివృద్ధి
ABN , First Publish Date - 2020-12-01T06:18:34+05:30 IST
కొమరిగిరి లేఅవుట్‌ను మెగా టౌన్‌షిప్పుగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
కొత్తపల్లి, నవంబరు 30: కొమరిగిరి లేఅవుట్‌ను మెగా టౌన్‌షిప్పుగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో అభివృద్ధి చేస్తున్న ఇళ్ల స్థలాల లేఅవుట్ స్థలాన్ని అధికారులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీలో ఇళ్లులేని పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు వీలుగా కొమరగిరిలో ప్రభుత్వం స్థల సేకరణ చేసిందన్నారు. పూర్తిస్థాయి మౌలిక సౌకర్యాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సైట్‌ను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీల వంటి సదుపాయాలతో పేదలకు ఇళ్ల స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, అర్బన్, రూరల్ తహశీల్దార్లు పాల్గొన్నారు.