కొమరగిరి ఇళ్ల స్థలాల లేఅవుట్‌ పరిశీలన

ABN , First Publish Date - 2020-12-20T06:42:20+05:30 IST

కొమరగిరిలో పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసే లేఅవుట్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్‌) కీర్తి శనివారం పరిశీలించారు.

కొమరగిరి ఇళ్ల స్థలాల లేఅవుట్‌  పరిశీలన

కొమరగిరి(కొత్తపల్లి), డిసెంబరు 19: కొమరగిరిలో పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసే లేఅవుట్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్‌) కీర్తి శనివారం పరిశీలించారు. ఈనెల 25న సీఎం కొమరగిరిలో ఇళ్ళ స్థలాల పంపిణీని ప్రారంభించేందుకు రానున్న దృష్ట్యా జేసీ కీర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో చిన్నికృష్ణ, తహశీల్దార్‌ ఎల్‌.శివకుమార్‌, ఎంపీడీవో పి.వసంతమాధవి తదితరులు జేసీ వెంట ఉన్నారు. 

Updated Date - 2020-12-20T06:42:20+05:30 IST