జిల్లా రెవెన్యు సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గం
ABN , First Publish Date - 2020-12-07T05:52:07+05:30 IST
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హడ్ కమిటీ అధ్యక్షుడిగా కాకినాడ అర్బన్ మండల డిప్యూటీ తహశీల్దార్ డీవీ మురళీకృష్ణ ఎన్నికయ్యారు.

కాకినాడ,డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హడ్ కమిటీ అధ్యక్షుడిగా కాకినాడ అర్బన్ మండల డిప్యూటీ తహశీల్దార్ డీవీ మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నికలకు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వాసా దివాకర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు, కార్యదర్శి శ్రీకాంత్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా వీఆర్వో సంఘ ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో దివాకర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు కృష్ణా జిల్లా తహశీల్దార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.సుగుణ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
నూతన కార్యవర్గం
సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సామర్లకోట తహశీల్దార్ వి.జితేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ, ఉపాధ్యక్షులుగా అమలాపురం తహశీల్దార్ జీఆర్ ఠాగూర్, కాకినాడ అర్బన్ వీఆర్వో సాయిరెడ్డి, కరపకు చెందిన ఎస్.పాపారావు, రాజోలుకు చెందిన డి.వీరభద్రం, అమలాపురానికి చెందిన వీఆర్వో కె.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, బిక్కవోలు తహశీల్దార్ కె.మాధవరావు, జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 20 మంది ఆఫీస్ బేరర్స్, ఐదుగురిని ఈసీ సభ్యులుగా ఎన్నుకున్నారు.