కాకినాడలో పోక్సో కోర్టు

ABN , First Publish Date - 2020-10-27T06:09:11+05:30 IST

అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్న మృగాళ్లను గుర్తించి, సత్వరం శిక్షలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడలో పోక్సో కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

కాకినాడలో పోక్సో కోర్టు

 కాకినాడ క్రైం, అక్టోబరు 26: అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్న మృగాళ్లను గుర్తించి,  సత్వరం శిక్షలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం  జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడలో పోక్సో కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌ (పోక్సో)-2012లో భాగంగా ప్రత్యేక కోర్టును కాకినాడకు మంజూరు చేశారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన పోక్సో కోర్టు త్వరలో ప్రారంభం కానుంది. పోక్సో కోర్టు నిందితులకు  మూడు నెలలలోపు శిక్షలు నిర్ధారించి అమలయ్యేలా కృషి చేస్తుంది.

Updated Date - 2020-10-27T06:09:11+05:30 IST