రసవత్తరంగా స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు

ABN , First Publish Date - 2020-12-29T07:20:38+05:30 IST

కార్పొరేషన్‌(కాకినాడ), డిసెంబరు28: కాకినాడ నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగా యి. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసి న సమావేశంలో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదు స్థానాలకు పది మంది నామినేష

రసవత్తరంగా స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకున్న మేయర్‌ పావని

జంప్‌ జిలానీలతో కలిపి అన్నీ వైసీపీ ఖాతాలోకే..

కార్పొరేషన్‌(కాకినాడ), డిసెంబరు28: కాకినాడ నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగా యి. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసి న సమావేశంలో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదు స్థానాలకు పది మంది నామినేషన్లు దాఖలు చేయడంతో బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ జరిపారు. ఒక్కో కార్పొరేటర్లు పది బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి తమకు నచ్చిన అభ్యర్థి ఎదురుగా టిక్‌ పెట్టమన్నారు. మొత్తం 48 మంది సభ్యులకుగాను ఇద్దరు మరణించడంతోపాటు మరో సభ్యుడు రాకపోవడంతో మేయర్‌తో కలిసి 45 మంది ఓటింగ్‌కు హాజరయ్యారు. మేయర్‌ సుంకర పావని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. మొత్తం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌కు సీల్‌ వేసి కమిషనర్‌ సమక్షంలో ఓట్లు లెక్కింపు చేపట్టారు. అనంతరం విజేతలను కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రకటించారు. విజేతలుగా నిలిచిన కోరుమిల్లి బాలప్రసాద్‌ (34 ఓట్లు), జేడీ పవన్‌కుమార్‌ (35 ఓట్లు), వాసిరెడ్డి రాంబాబు (33 ఓట్లు), చవ్వాకుల రాంబాబు(32 ఓట్లు), మీసాల శ్రీదేవి(30 ఓట్లు) కైవసం చేసుకుని విజ యం సాధించారు. అలాగే మల్లిపూడి నాగసూర్య దీపిక (15 ఓట్లు), ఇమ్మిడిశెట్టి రమణమ్మ (13 ఓట్లు), కొపనాతి నాగ సత్యనారాయణ (12 ఓట్లు) తహేరా  ఖాతూన్‌ (11 ఓట్లు), తుమ్మల సునీత (10 ఓట్లు) తెచ్చుకున్నారు. అనంతరం స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు ధ్రువపత్రాలు అందజేశారు. 

వెలుగు చూసిన క్రాసింగ్‌ ఓటింగ్‌..

కార్పొరేషన్‌లో ప్రస్తుతం 35 మంది టీడీపీ కార్పొరేటర్లు (ముగ్గురు ఇండిపెండెంట్‌లు కలిపి), 10 మంది వైసీపీ కార్పొరేటర్లు, ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ, ఇండిపెండెంట్‌, బీజేపీ కార్పొరేటర్లలో చాలామంది అధికారికంగా చేరకపోయినా వైసీపీలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో గతేడాది స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగగా, ఈ ఏడాది ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం వైసీపీ తరుపున పోటీ చేసిన ఐదుగురిలో మీసాల శ్రీదేవి ఒక్కరే వైసీపీ కార్పొరేటర్‌. మిగిలిన వారంతా టీడీపీ నుంచి గెలిచి ఇప్పుడు వైసీపీ తరపున బరిలోకి దిగినట్టు అయింది. ఇటు వారికి ప్రత్యర్థులుగా ఐదుగురు టీడీపీ కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేయగా, వీరికి మరో ఐదుగురు టీడీపీ కార్పొరేటర్లు నామిని సంతకాలు చేశారు. ఫలితాల తర్వాత 10 మంది టీడీపీ కార్పొరేటర్లు పార్టీకి కట్టుబడి ఉన్నట్టు తేట తెల్లమైంది. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహకరణ వరకు ఉన్న టీడీపీ కార్పొరేటర్‌ బండి సత్యనారాయణ ఓటింగ్‌కు హాజరుకాకుండా గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-12-29T07:20:38+05:30 IST