ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

ABN , First Publish Date - 2020-12-01T06:12:03+05:30 IST

భానుగుడి (కాకినాడ), నవంబరు 30: కాకినాడ కలెక్టరేట్‌ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి. ఉపా చట్టం కిం ద అక్రమంగా అరెస్టు చేసిన 16 మంది నాయకులను

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌
బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కొనసాగించాలని నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

భానుగుడి (కాకినాడ), నవంబరు 30: కాకినాడ కలెక్టరేట్‌ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి. ఉపా చట్టం కిం ద అక్రమంగా అరెస్టు చేసిన 16 మంది నాయకులను తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐసీ రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు, ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందన్నా రు. ప్రజల హక్కుల కోసం గళమెత్తిన అనేక మంది ప్రొఫెసర్లు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులను బీమా కోరేగామ్‌ కుట్రలో అక్రమంగా నిర్బంధించి జీవించే హక్కును కాలరాస్తుందని పేరొకన్నారు. ఫాదర్‌ స్టాన్‌ స్వామి, వరవరావుతో పాటు ఉపా చట్టంలో అక్రమంగా నిర్బంధించిన 16 మందిని విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కొనసాగించాలి

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ను ఆపడం పేద వర్గాల విద్యార్థులకు అన్యాయం చేయడమేనని బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఆర్టీ ఏనుగుపల్లి కృష్ణ అన్నారు. తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ బెస్ట్‌ అవైలబుల్‌ పేరిట చదువుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమనడం భావ్యం కాదన్నారు. ఈ స్కీమ్‌ను యథావిధిగా కొనసాగించి తక్షణమే ఫీజులు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-01T06:12:03+05:30 IST