ప్రియుడు మోజులో పడి భర్తను హతమార్చిన భార్య

ABN , First Publish Date - 2020-10-04T09:36:43+05:30 IST

ప్రియుడు మోజులో పడి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడు మోజులో పడి భర్తను హతమార్చిన భార్య

- వంగలపూడి మృతిపై వెలుగులోకి వచ్చిన కొత్తకోణం

- హత్యకేసు వివరాలు వెల్లడించిన ఎస్సీఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎలియాసాగర్‌ 


ఐ.పోలవరం, అక్టోబరు 3: ప్రియుడిపై మోజుతో అడ్డుగా ఉన్న భర్తను హతమార్చిన భార్య కటకటాలపాలైంది. ప్రియుడు, మరొక వ్యక్తితో కలిసి భర్తను చంపి కరెంట్‌షాక్‌తో మృతిచెందాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఐ.పోలవరం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకుడు వంగలపూడి సుబ్బారావు హత్య సంఘటనకు సంబంధించిన వివరాలు కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఐ.పోలవరం గ్రామానికి చెందిన వంగలపూడి సుబ్బారావు(50) గతనెల 29న మృతిచెందడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎస్‌.రాము ఆధ్వర్యంలో పోలీసులు, క్రైమ్‌పార్టీ రంగంలోకి దిగి సుబ్బారావు మృతిపై కూపీ లాగడంతో కొత్తకోణం వెలుగుచూసింది. మృతుడి భార్య వంగలపూడి దుర్గకు అదే గ్రామానికి చెందిన మట్టపర్తి దుర్గాప్రసాద్‌కు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. దుర్గాప్రసాద్‌ మరొక వ్యక్తి యలమంచిలి కొండబాబుతో కలిసి దుర్గ భర్తను గతనెల 29న హతమార్చారని వెల్లడించారు. సుబ్బారావుకు తొలుత నిద్రమాత్రలు ఇచ్చి ఆ తర్వాత దిండు, దుప్పటితో ముఖంపై నొక్కి ప్రాణం తీశారని విచారణలో వెల్లడైందన్నారు. కరెంట్‌ వెల్డింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుబ్బారావు విద్యుత్‌షాక్‌తో మృతిచెందినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్నారు. అతడిని హతమార్చిన తర్వాత ఇంటిపక్క సందులో పడవేసి చేతిలో వెల్డింగ్‌ చేసుకునే ఎలక్ట్రికల్‌ పరికరాలు ఉంచి నమ్మబలికేందుకు ప్రయత్నించారని చెప్పారు. కానీ విచారణలో ఇది హత్యగా నిర్ధారణ కావడంతో నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. ముమ్మిడివరం సీఐ ఎస్‌.జానకీరామ్‌, ఎస్‌ఐ ఎస్‌.రాము, పోలీసు సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2020-10-04T09:36:43+05:30 IST