16 నుంచి ‘నన్నయ’ సెట్
ABN , First Publish Date - 2020-10-04T09:34:09+05:30 IST
16 నుంచి ‘నన్నయ’ సెట్
దివాన్‌చెరువు, అక్టోబరు 3: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు ఈనెల 16 నుంచి 19 వరకు ని ర్వహిస్తున్నామని నన్నయ ఉప కులపతి మొక్కా జగన్నాథరావు తెలిపారు. విశ్వవిద్యాలయంలో శనివారం నన్నయ సెట్ 2020 పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను వీసీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్నయ సెట్‌కు 6810మంది విద్యార్థులు దరఖా స్తు చేసుకున్నారన్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు విజయవాడ, విశాఖపట్నంతో కలిపి 10 నన్నయ సెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎ్‌సఎన్ క్యాంపస్, కాకినాడ ఎస్‌కేవీటీ కళాశాల, రాజమహేంద్రవరం ఎస్‌కేబీఆర్ కళాశాల అమలాపురం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ క్యాంపస్ తాడేపల్లిగూడెం, శ్రీసీఆర్‌రెడ్డి పీజీ కళాశాల ఏలూరు, కేజీఆర్ పీజీ కళాశాల భీమవరం, శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెం, విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కళాశాల, విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. నాలుగురోజులపాటు ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.00 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 16న ఉదయం లైఫ్ సైన్సెస్, మధ్యాహ్నం మ్యాథమెటిక్స్, జియాలజీ, 17న ఉదయం ఫిజికల్ సైన్సెస్, మధ్యాహ్నం కంప్యూటర్ సైన్సెస్, 18న ఉదయం కెమికల్ సైన్సెస్, మధ్యాహ్నం హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, 19న ఉదయం ఇంగ్లీషు, ఎంపీఈడీ, మధ్యాహ్నం హిందీ, తెలుగు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈనెల 7 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.