కేజీబీవీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-13T16:41:39+05:30 IST

జిల్లాలో ఉన్న 12 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ..

కేజీబీవీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న 12 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న ఆరో తరగతి, ఇంటర్‌ మొదటి ఏడాదిలో విద్యార్థుల ప్రవేశాలకు ఈనెల 15 వరకు ఆయా కేజీబీవీల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షా సొసైటీ(ఎస్‌ఎస్‌ఎస్‌) ఏపీసీ బివిజయభాస్కర్‌ తెలిపారు. చింతూరు, రంపచోడవరం, శంఖవరం కేజీబీవీల్లో సీట్లు లేవన్నారు. ఇక ఎ.గంగవరంలో ఆరో తరగతిలో 9, ఇంటర్‌లో 3 సీట్లు ఉన్నాయి. కోటనందూరులో ఆరో తరగతి 0, ఇంటర్‌ 1.. కూనవరంలో ఆరో తరగతి 0, ఇంటర్‌ 15.. మారేడుమిల్లిలో ఆరో తరగతి 24, ఇంటర్‌ 19, తొండంగిలో ఆరో తరగతి 5, తునిలో 11 సీట్లు ఉన్నాయి.

Updated Date - 2020-11-13T16:41:39+05:30 IST