కరోనా వ్యాక్సిన్‌కు స్టోరేజీ పాయింట్లు సిద్ధం : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2020-12-30T07:38:13+05:30 IST

జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉన్న నేపఽ థ్యంలో స్టోరేజీ పాయింట్లు సిద్ధం చేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ గౌరీశ్వరరావు తెలిపా రు.

కరోనా  వ్యాక్సిన్‌కు స్టోరేజీ పాయింట్లు సిద్ధం :  డీఎంహెచ్‌వో
గొల్లప్రోలు పీహెచ్‌సీని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో గౌరీశ్వరరావు

గొల్లప్రోలు, డిసెంబరు 29: జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉన్న నేపఽ

థ్యంలో స్టోరేజీ పాయింట్లు సిద్ధం చేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ గౌరీశ్వరరావు తెలిపా రు. మంగళవారం ఆయన గొల్లప్రోలు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలి దశలో 35 వేల మంది హెల్త్‌కేర్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. రెండో విడతలో పోలీసు, మునిసిపల్‌ వర్కర్లు, రెవెన్యూ ఉద్యోగులు, మూడో దశలో 50 సంవత్సరా లపైబడి వివిధ రోగ లక్షణాలు ఉన్నవారికి, నాలుగో దశలో అందరికీ వ్యాక్సినేషన్‌ జరుగుతుందని వివరించారు. జిల్లాలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. యూకే నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. గొల్లప్రోలు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి స్థలం గుర్తించినట్టు చెప్పారు. ఆయన వెంట గొల్లప్రోలు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్యామల తదితరులు ఉన్నారు.
నిధుల్లేక..

కొడిగడుతున్న పంచాయతీలు

పాలక వర్గాల్లేక గ్రామాల్లో లోపించిన జవాబుదారీతనం 

ప్రత్యేకాధికారులున్నా సొమ్ముల్లేక కుంటుపడుతున్న అభివృద్ధి 

 సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీలను గాలికొదిలేసిన వైనం 


కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో అమలు చేసినా పథకాలన్నీ అటకెక్కాయి. పాలనలో మార్పు, ప్రజలకు పారదర్శకంగా సేవలందించడానికి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న 1072 పంచాయతీల పరిధిలో 11,994 వార్డుల్లో అభివృద్ధి పడకేసింది. పాలక వర్గాల్లేక గ్రామాల్లో జవాబుదారీతనం లోపిస్తోంది. ప్రత్యేక అధికారులున్నప్పటికీ, ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో అస్తవ్యస్తంగా మారుతోంది. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది జనవరి 2న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో 62 జడ్పీటీసీ, ఎంపీపీ, 1184 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయ్యే సరికి కరోనా ఉనికి వల్ల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.  గత ఏడాది ఆగస్టులో పంచాయతీల పాలకవర్గ గడువు ముగిసింది. అయితే ఆగస్టుకు ముందే ఎన్ని కలు జరగాల్సి ఉండగా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పలు కారణాలను చూపి ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌లో పడ్డాయి. 14వ ఫైనాన్స్‌ నిధులు అరకొరగా మంజూరు చేసినా, అప్పటికే చేసిన పనుల బిల్లులకు కాంట్రాక్టర్‌లు ఆందోళన చేయడంతో వారికి వచ్చిన నిధుల్లో సింహభాగం చెల్లించాల్సి వచ్చింది. దీంతో వచ్చిన నిధులన్నీ బకాయిలకు పోవడంతో తదుపరి అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. మార్చిలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధపడింది. దీనికి సంబంధించి 11,994 వార్డు సభ్యులకు, 1072 సర్పంచ్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అప్పటికే కొన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు కొవిడ్‌ 19 వైరస్‌ రూపంలో ఆటంకం ఏర్పడింది. మార్చి 21 నుంచి వరుస లాక్‌డౌన్‌లో అమలయ్యాయి. దీంతో ఎన్నికలు నిలిచిపోయాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా ప్రభావం తగ్గుతోందని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవ్వాలని రాష్ట్ర ఎన్నికల సం ఘం పేర్కొనగా, వైరస్‌ పూర్తిగా సమసిపోలేదని, అందువల్ల ఎన్ని కలు జరపలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాయి. 

 అడకత్తెరలో పోక చెక్కలా..

ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదోపవాదనలకు దిగుతున్న నేపథ్యంలో స్థానిక పాలక వర్గాల్లేకపోవడం, ప్రత్యేకాధికారులున్నా నిధుల లేమితో మేజర్‌ పంచాయితీలన్నీ అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాయి. మైనర్‌ పంచాయతీలకు మంజూరు చేస్తున్న అరకొర నిధులు విద్యుత్‌ బకాయిలకు సరిపోతున్నాయి. ఇప్ప టికే జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లులు కోట్లల్లో పేరుపోయాయని విద్యుత్‌ శాఖ గగ్గోలు పెడుతోంది. పాలకవర్గాలుండే సమయంలో బకాయిలున్నప్పటికీ సర్పంచ్‌లు సొంత సొమ్ము కొంత వెచ్చించి పరిస్థితి కాస్త గాడిలో పెడుతుండేవారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వీరు ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులతో చర్చించి ఎంతోకొంత నిధులు సమీకరించుకునేవారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులున్నా, వీరికి తమ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లేవారు కనిపించడం లేదు. ప్రత్యేకాధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడంతో నిధులు అడిగే సాహసం చేయడం లేదు. దీంతో పంచాయతీల్లో పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. ఈ క్రమంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం అంతంతమాత్రంగానే జరుగుతోంది. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్‌, రక్షిత మంచినీటి విభాగాధికారులు పారిశుధ్య వారోత్సవాలు, స్వచ్ఛసర్వేక్షణ్‌ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఈ సీజన్‌లో చలి తీవ్రత వల్ల దోమల సంతతి పెరుగుతున్నందున ప్రతీ గ్రామం శుభ్రంగా ఉండాల్సిన పరిస్థితి. ఇటు కొవిడ్‌ నేపథ్యంలో కూడా పారిశుధ్యం, తాగునీటికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. కానీ గ్రామాల్లో క్లోరినేషన్‌, బ్లీచింగ్‌ వెదజల్లడానికే ఇప్పుడు ప్రత్యేకాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీర ప్రాంతాలు, ఏజెన్సీ మండలాల్లో తాగునీరు అక్కడక్కడా కలుషితమవుతుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగు నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచాల్సిన సమయంలో రక్షిత నీటి విభాగానికి కూడా సరిపడా నిధులు రావడం లేదు. ఒక వైపు ఎన్నికలు నిర్వహించక, నిధులు సరిపడా మంజూరు చేయక ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తుండడంతో మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-12-30T07:38:13+05:30 IST