-
-
Home » Andhra Pradesh » East Godavari » karona raily amp
-
కరోనాతో మరింత అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-10-31T06:16:15+05:30 IST
రెండో దశలో కరోనా వైరస్ మరింత వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సూచించారు.

అమలాపురం టౌన, అక్టోబరు 30: రెండో దశలో కరోనా వైరస్ మరింత వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సూచించారు. శుక్ర వారం రాత్రి అమలాపురంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రద ర్శనలో మంత్రి విశ్వరూప్, సబ్‌కలెక్టర్ హిమాన్షుకౌశిక్‌తో పాల్గొన్నారు. గడియార స్తంభం సెంటర్ నుంచి చేపట్టిన ర్యాలీ హైస్కూల్ సెంటర్ వరకు సాగింది. ర్యాలీలో తహశీ ల్దార్ గెడ్డం రవీంద్రనాథ్‌ఠాగూర్, మున్సిపల్ డీఈ కె.అప్పల రాజు, నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, మట్ట పర్తి నాగేంద్ర, కొల్లాటి దుర్గాభాయి, సరెళ్ల రామకృష్ణ, కర్రి వీర రాఘవులు, వాసంశెట్టి సత్యం, పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే. బాజీ లాల్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. పాలగు మ్మిలో కార్యదర్శి బి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో గ్రామపెద్దలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.