కందరెడ్డికి రైతునేస్తం అవార్డు
ABN , First Publish Date - 2020-12-17T06:02:03+05:30 IST
కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సత్తి భాస్కరరెడ్డి(కందరెడ్డి)కి మరో పురస్కారం లభించింది.

ఉపరాష్ట్రపతి నుంచి అందుకున్న మరో పురస్కారం
కడియం, డిసెంబరు 16: కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సత్తి భాస్కరరెడ్డి(కందరెడ్డి)కి మరో పురస్కారం లభించింది. ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో రైతునేస్తం అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నుంచి రైతునేస్తం అవార్డును అం దుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రగతి సాధించిన వినూత్న వ్యవసాయ విధానా లు అవలంభిస్తూ ఉత్తమరైతుగా కందరెడ్డి పేరుగాంచారు. పెద్దగా చదువు లేకపో యిన అంతర్జాతీయ మార్కెట్‌ను అవపోసన పట్టి గొల్కంద వంటి సరికొత్త పంటలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అపర భగీరధుడు కాటన్ మహాశయుని విగ్రహాన్ని ఇంటి ముందు నెలకొల్పి కాటన్ వర్థంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దుళ్ళతో పాటు మురమండ, వీరవరం, ఆలమూరు మండలం చొప్పెల్ల వంటి పరిసర గ్రామా ల్లో పార్కులు, ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందజేస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలతో పాటు గౌరవ డాక్టరేట్ పొందారు. రైతు నేస్తం పురస్కారం అందుకున్న కందరెడ్డిని పలువురు అభినందించారు.