కాకినాడలో ఇంటింటికీ స్మార్ట్‌ విద్యుత్ మీటర్లు

ABN , First Publish Date - 2020-10-28T06:39:54+05:30 IST

మీరు విద్యుత బిల్లు కట్టలేదా.. అయినా అధికారులు వచ్చి కనెక్షన తీయరులే అని ధీమాగా ఉంటున్నారా.. ఎప్పుడో అపరాధ రుసుంతో కడదాం అనుకుంటున్నారా.. ఇకపై అలా కుదరదు. కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్యాలయం నుంచే మీ ఇంటికి విద్యుత సరఫరా నిలిపివేస్తారు.

కాకినాడలో ఇంటింటికీ స్మార్ట్‌ విద్యుత్ మీటర్లు
కాకినాడ స్మార్ట్‌ సిటీ

భూగర్భ విద్యుత లైన పూర్తైన చోట ప్రయోగాత్మకంగా తొమ్మిది వేల గృహాలకు బిగింపు

ఆ తర్వాత దశల వారీగా నగరం అంతా అమలు.. రూ.100 కోట్ల వరకు ఖర్చు

సింగపూర్‌ నుంచి మీటర్ల రాక.. ఒక్కో దాని ఖరీదు రూ.8 వేలు.. ఉచితంగానే ఇన్‌స్టాలేషన

బిల్లు కట్టకపోతే ఇకపై స్మార్ట్‌ సిటీ కార్యాలయం నుంచే నేరుగా సరఫరా నిలిపివేత

విద్యుత చౌర్యం, వినియోగం లెక్కింపు పక్కాగా


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

మీరు విద్యుత బిల్లు కట్టలేదా.. అయినా అధికారులు వచ్చి కనెక్షన తీయరులే అని ధీమాగా ఉంటున్నారా.. ఎప్పుడో అపరాధ రుసుంతో కడదాం అనుకుంటున్నారా.. ఇకపై అలా కుదరదు. కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్యాలయం నుంచే మీ ఇంటికి విద్యుత సరఫరా నిలిపివేస్తారు. మీరు గంటగంటకు ఎంత విద్యుత వాడుతున్నారు ? రాత్రి వేళల్లో చౌర్యం జరుగుతుందా? వంటివన్నీ పసిగట్టేస్తారు. కనెక్షన కట్‌ అయిన తర్వాత బిల్లు కడితే క్షణాల్లో తిరిగి సరఫరా పునరుద్ధరిస్తారు.. ఏంటిదంతా అనుకుంటున్నారా.. నిజమే, త్వరలో కాకినాడ నగరంలో ఈ కొత్త విధానం అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సింగపూర్‌ నుంచి రప్పించిన విద్యుత మీటర్లు ఇంటింటకీ బిగించబోతున్నారు. ఒక్కో స్మార్ట్‌ విద్యుత మీటర్‌ ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.8 వేలు.

కాకినాడ స్మార్‌సిటీ నగరంలో విద్యుత సరఫరా వ్యవస్థలో కొత్త విధానాన్ని కేంద్రం అమలుచేయబోతోంది. స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా స్మార్ట్‌ విద్యుత మీటర్లు ఇంటింటికి బిగించ బోతున్నారు. నగరంలో మొత్తం 95 వేల వరకు విద్యుత కనెక్షన్లు ఉన్నాయి. వీటి స్థానంలో స్మార్ట్‌ మీటర్లు దశలవారీగా బిగించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు రూ.100 కోట్ల వరకు ఖర్చు కానుంది. ప్రస్తుతం పూర్తిగా నిధులు లేకపో వడంతో తొలి దశలో తొమ్మిది వేల ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించనున్నారు. సింగపూర్‌ నుంచి కొనుగోలు చేసిన ఈ మీట ర్లు ఇప్పటికే స్మార్ట్‌సిటీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఒక్కో మీటర్‌ ఖరీదు రూ.8 వేలు. అయితే వీటిని ఉచితంగానే ప్రతి ఇంటికి బిగిస్తారు. ఈ విద్యుత మీటర్‌లో ఒక సిమ్‌కార్డు ఉంటుంది. దీన్ని ఇంటికి బిగించిన తర్వాత ప్రతి గంటకు అందులో సిమ్‌కార్డు యాక్టివేట్‌ అయి విద్యుత వినియోగం లెక్కిస్తుంది. వాడకం సమాచారాన్ని డేటా కలెక్షన యూనిట్‌కు గంటగంటకు పంపుతుంది. తద్వారా 24 గంటల్లో ఏ గంట ఎంత విద్యుత వాడారో మొత్తం సమాచారం కాకినాడ స్మార్ట్‌ సిటీ అధికారుల వద్ద ఉంటుంది. ఈ విధానంలో విద్యుత సిబ్బందిని కుదించడంతోపాటు విద్యుత చౌర్యం జరగ కుండా చూడడం, వేసవిలో మొత్తం విద్యుత వినియోగం ఎలా ఉంది? ఏసమయంలో ఎంత వాడకం జరుగుతోంది? అనే లెక్కలు తెలుసుకోవడంతోపాటు విద్యుత ఉత్పత్తి సంస్థలకు సమాచారం అందిస్తారు. అంతేకాదు సకాలంలో ఎవరు బిల్లు కట్టకపోయినా మరుక్షణమే కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్యాలయం నుంచి ఆ ఇంటిలోని స్మార్ట్‌ విద్యుత మీటర్‌కు సిగ్నల్‌ పంపి సరఫరా నిలిపివేస్తారు. డబ్బులు కట్టిన తర్వాత వెంటనే పునరుద్ధరిస్తారు. ప్రయోగాత్మ కంగా ఈ కొత్త విధానాన్ని కాకినాడ దేవాలయం వీధిలో అమలు చేయనున్నారు.


అక్కడి నుంచే ఎందుకంటే...

స్మార్ట్‌సిటీ పథకం కింద కాకినాడలో రూ.60 కోట్లు వెచ్చించి ఎనిమిది కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత లైనను ఇప్పటికే నిర్మించారు. తొలి దశ కింద సర్పవరం జంక్షన నుంచి జగన్నాథపురం, అటు నుంచి జిల్లా పరిషత సెంటర్‌ వరకు ఈ లైన పూర్తయింది. దీని పరిధిలో 16 ఫీడర్లకు చెందిన మూడు వేల విద్యుత మీటర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఆరు వేల మీటర్లు బిగించి కొత్త విధానం అమలు చేయనున్నారు. ఇందుకోసం ఆరు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇంటింటికీ స్మార్ట్‌ మీటర్‌ బిగించిన తర్వాత గంటగంటకు విద్యుత వినియోగం లెక్కింపు కోసం ప్రతి పది నిమిషాలకు మీటర్‌లోని సిమ్‌కు పూర్తి స్థాయి సిగ్నల్‌ అందాల్సి ఉంటుంది. అందుకోసం ఎయిర్‌ టెల్‌తో అధికారులు ఒప్పందం కుదుర్చుకుని కొత్త విధానం త్వరలో అమలుచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి విద్యుతస్మార్ట్‌ మీటర్ల విధానం తొలుత విశాఖ స్మార్ట్‌ సిటీలో ప్రారంభించారు. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్టు రద్దైంది. దీంతో కాకినాడలో చేపట్టనున్న ఈ విధానం రాష్ట్రంలో తొలి ప్రయోగం కానుంది.

Updated Date - 2020-10-28T06:39:54+05:30 IST