కాకినాడ జిల్లాకు పిఠాపురం రాజా పేరు పెట్టాలి
ABN , First Publish Date - 2020-10-08T06:47:53+05:30 IST
కాకినాడ పార్లమెంట్ జిల్లాకు పిఠాపురం మహారాజా పేరు పెట్టాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ జహిరుద్దీన్ జిలానీ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కోరారు...

డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), అక్టోబరు 7: కాకినాడ పార్లమెంట్ జిల్లాకు పిఠాపురం మహారాజా పేరు పెట్టాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ జహిరుద్దీన్ జిలానీ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కోరారు. కాకినాడలో పీఆర్ కళాశాల, అన్నదాన సమాజం, రేచెర్లపేట స్థలాలు, ఓం భవనం, ఇతర ప్రాంతాల్లో అనాఽథ శరణాలయాలు, మొల్ల, డప్పుల, కంసాలి మాన్యాలు, విశ్రాంతి భవనాలు కట్టించిన అభినవ కర్ణుడు మహారాజా అన్నారు. ఈ సేవలను గుర్తించి కాకినాడకు మహారాజా పేరు పెట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.