కొండపోడులకు పట్టాలు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2020-11-03T06:25:02+05:30 IST

పేదలు సాగు చేసుకుంటున్న బంజరు భూములకు, కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ప్రత్తిపాడులో సీపీఐఎంల్‌ లిబరేషన్‌, రైతు కూలీ సంఘం కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.

కొండపోడులకు పట్టాలు మంజూరు చేయాలి

ప్రత్తిపాడు, నవంబరు 2: పేదలు సాగు చేసుకుంటున్న బంజరు భూములకు, కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ప్రత్తిపాడులో సీపీఐఎంల్‌ లిబరేషన్‌, రైతు కూలీ సంఘం కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎస్సైన్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించి చిం తలూరు, లంపకలోవ యూజే పురం, పోతులూరు గ్రామాల్లోని బంజరు, కొం డపోడు భూములు సాగుచేసుకుంటున్న పేదలకు హక్కు పత్రాలు మంజూ రు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో కె.జనార్దన్‌, రేసుకట్ల సింహాచలం, మానుకొండ లచ్చబాబు, రాపా లక్ష్మి, బాబురావు, రత్నం పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T06:25:02+05:30 IST