జర్నలిస్టుల్ని ఉద్యోగ సంఘాలు ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-04-25T09:14:14+05:30 IST
కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికపుడు ప్రజలకు చేర

కాకినాడ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికపుడు ప్రజలకు చేర వేస్తున్న జర్నలిస్టుల్లో అధిక సంఖ్యలో పేదలున్నారని, వారిని ఆదుకోవడం ఉద్యోగ సంఘాల ప్రధాన బాధ్యతని ఏపీ అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ పితాని త్రినాధరావు పిలుపునిచ్చారు.
జేఏసీ జిల్లా శాఖ, ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 100మంది జర్నలిస్టులకు 10 కిలోల బియ్యం, కూరగాయలు, కందిపప్పు తదితర వస్తువులతో కూడిన కిట్లను శుక్రవారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యు భవన్‌లో పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు, రెవెన్యు అసోసియేషన్ నాయకులు దొమ్మేటి కృష్ణ, కలెక్టరేట్, కాకినాడ ఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.