త్వరగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు

ABN , First Publish Date - 2020-06-23T10:47:00+05:30 IST

వినియోగదారుల ఆర్డర్‌ మేరకు వీలైనంత త్వరగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని జేసీ లక్ష్మీశ సంబంధింత అధికారులను ..

త్వరగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు

జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ


కాకినాడ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): వినియోగదారుల ఆర్డర్‌ మేరకు వీలైనంత త్వరగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని జేసీ లక్ష్మీశ సంబంధింత అధికారులను ఆదేశించారు. ఇసుక పంపిణీ విషయంలో జిల్లాలో తొలిసారిగా సోమవారం డయల్‌ యువర్‌ జేసీ పేరిట కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో వినియోగదారులు ఫోన్‌కాల్స్‌కు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు వినియోగదారుల ఫిర్యాదులు స్వీకరిస్తామని, తొలిరోజు 58 వినతులు వచ్చాయని తెలిపారు. జిల్లా ఇసుక సరఫరా అధికారి కె.జాషువ పాల్గొన్నారు.

Read more