-
-
Home » Andhra Pradesh » East Godavari » job mela ttdc
-
ఈ నెల 28న టీటీడీసీలో జాబ్ మేళా
ABN , First Publish Date - 2020-11-25T05:43:25+05:30 IST
సామర్లకోట టీటీడీసీలో ఈ నెల 28న ఉదయం 9.30 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాఽథ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాకినాడ,నవంబరు23(ఆంధ్రజ్యోతి): సామర్లకోట టీటీడీసీలో ఈ నెల 28న ఉదయం 9.30 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 నుంచి 2020లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణులు, బీఎస్సీ డిస్‌కంటిన్యూ అయిన యువకులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఎంపికయిన వారు హైదరాబాద్‌లోని న్యూ లాండ్ లేబొరేటరీలో మాన్యుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్‌లుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. వారికి నెలకు రూ.16,250 చెల్లిస్తారన్నారు. వివరాలకు 9030924569, 8919868419 నంబర్లలో సంప్రదించాలన్నారు.