18న జాబ్‌మేళా

ABN , First Publish Date - 2020-02-16T09:13:19+05:30 IST

అమెజాన్‌ పేలో పని చేసేందుకు ఈ నెల 18న కాకినాడ ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా

18న జాబ్‌మేళా

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 15: అమెజాన్‌ పేలో పని చేసేందుకు ఈ నెల 18న కాకినాడ ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.శాంతి శనివారం తెలిపారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీతో ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి  కార్యాలయంలో హాజరుకావాలన్నారు. పదో తరగతి, ఇంటర్‌తో పాటు ఏదైనా డిగ్రీ చేసి 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.14,500 నుంచి 18,200 వరకు, సీటీసీ అభ్యర్థులకు రూ.18వేల నుంచి 22 వేల వరకు ఉంటుందన్నారు.

Updated Date - 2020-02-16T09:13:19+05:30 IST