రేపు సామర్లకోటలో ఉద్యోగ మేళా

ABN , First Publish Date - 2020-11-19T05:45:18+05:30 IST

సామర్లకోట, నవంబరు 18: టీటీడీసీ ఆవరణలో శుక్రవారం సీడాప్‌, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తా మని డీఆర్డీఏ పీడీ హరిహరనాధ్‌ బుధవారం తెలిపారు. అమర్‌రాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ్‌సలో మెషీన్‌ ఆపరేటర్స్‌గా పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐలలో ఉత్తీర్ణులైన

రేపు సామర్లకోటలో ఉద్యోగ మేళా

సామర్లకోట, నవంబరు 18: టీటీడీసీ ఆవరణలో శుక్రవారం సీడాప్‌, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తా మని డీఆర్డీఏ పీడీ హరిహరనాధ్‌ బుధవారం తెలిపారు. అమర్‌రాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ్‌సలో మెషీన్‌ ఆపరేటర్స్‌గా పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐలలో ఉత్తీర్ణులైన 19 నుంచి 30 సంవత్సరాల వయస్సుగల యువకులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. మెడ్‌ప్లస్‌ సంస్థలో ట్రైనీ ఫర్మసిస్ట్‌ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు.. ఫార్మసిస్ట్‌ పోస్టులకు బిఫార్మశీ, డీ.ఫార్మశీలలో ఉత్తీర్ణులైన స్త్రీ, పురుష అభ్యర్థులు వర్చువల్‌ మోడ్‌(జూమ్‌యాప్‌ ద్వారా)లో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రావాలన్నారు. వివరాలకు సెల్‌ 8919868419కు సంప్రదించాలని పీడీ కోరారు.

Updated Date - 2020-11-19T05:45:18+05:30 IST