23న సామర్లకోటలో ఉద్యోగమేళా

ABN , First Publish Date - 2020-10-21T06:00:23+05:30 IST

కాకినాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): సామర్లకోట టీటీడీసీలో ఈనెల 23న ఉదయం 9.30 గంటల నుంచి ఉద్యోగమేళా నిర్వహిస్తున్నామని డీఆర్‌డీఏ

23న సామర్లకోటలో ఉద్యోగమేళా

కాకినాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): సామర్లకోట టీటీడీసీలో ఈనెల 23న ఉదయం 9.30 గంటల నుంచి ఉద్యోగమేళా నిర్వహిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ వైహరిహరనాథ్‌ తెలిపారు. జిల్లాలో శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్సలో బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 24 నుంచి 38 ఏళ్ల మహిళ, పురుష అభ్యర్థులు  అర్హులన్నారు. ఏదైనా డిగ్రీ, ఎంబీఏ అర్హత ఉండాలన్నారు. ఎంపి కైన వారికి నెలకు రూ.24 వేల వేతనం ఉంటుందన్నారు. ఇంటర్‌, డిగ్రీ చదివినవారు యూనిట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.15వేల వేతనం ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లా తడలోని శ్రీ సిటీలో హీరో మోటార్‌ క్రాప్‌ లిమిటెడ్‌లో, ఇదే ప్రాంతంలో ఫ్లెక్స్‌ ఇండియాలో పనిచేయడానికి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివినవారు అర్హులన్నారు. వివరాలకు 9030924569, 8919868419లో సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2020-10-21T06:00:23+05:30 IST