ఏప్రిల్‌ 14 వరకూ జేఎన్టీయూకే మూసివేత

ABN , First Publish Date - 2020-03-28T10:13:51+05:30 IST

కరోనా (కొవిడ్‌ 19) కారణంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జేఎన్టీయూకేను ఏప్రిల్‌ 14వరకూ మూసివేస్తున్నట్టు

ఏప్రిల్‌ 14 వరకూ జేఎన్టీయూకే మూసివేత

ఉప కులపతి రామలింగరాజు 


జేఎన్టీయూకే, మార్చి 27: కరోనా (కొవిడ్‌ 19) కారణంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జేఎన్టీయూకేను ఏప్రిల్‌ 14వరకూ మూసివేస్తున్నట్టు ఉప కులపతి ఎం.రామలింగరాజు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కరోనాకు సంబంధించి వర్శిటీలో వీసీ ఆధ్వర్యాన సమీక్షా సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ వర్శిటీ ప్రాంగణం, చుట్టుపక్కల సిబ్బంది క్వార్టర్స్‌ పరిసరాల్లో పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర విధులకు హాజరయ్యే ఉద్యోగులకు పాస్‌లను అందజేసేందుకు సంబంధిత అధికారులతో సంప్రదించి ఏర్పాటు చేయాలని రిజిస్ట్రార్‌ సీహెచ్‌ సత్యనారాయణకు సూచించారు. పారిశుధ్య సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజులు అందించాలన్నారు. వర్శిటీలో ఇంటర్నెట్‌, ఇతరసేవలు కొనసాగుతాయని తెలిపారు.


యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌ కోర్సులను పటిష్ట ప్రణాళికతో అమలుచేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నామన్నారు.  వర్శిటీ క్యాంపస్‌ కళాశాలలైన యూసీఈవీ, యూసీఈఎన్‌లలో కరోనా వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్స్‌కు ఆయన సూచించారు. స్వీడన్‌, బ్యాంకాక్‌లోని విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అభ్యసిస్తున్న వర్శిటీ విద్యార్థుల స్థితిగతులు, ఆరోగ్యంపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని డైరెక్టర్‌ సీహెచ్‌ సాయిబాబు, ప్రిన్సిపాల్‌ బాలకృష్ణ వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో రెక్టార్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, డైరెక్టర్లు, ప్రోగ్రాం డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-28T10:13:51+05:30 IST