-
-
Home » Andhra Pradesh » East Godavari » Jeetallev for 270 people in the district
-
జిల్లాలో 270 మందికి జీతాల్లేవ్..
ABN , First Publish Date - 2020-10-07T08:12:21+05:30 IST
దాదాపు పద కొండు నెలలుగా జీతాలు లేక జిల్లాలో రెండో విడత నియమితులైన 270 మంది గ్రామ, వార్డు వలంటీర్లు విలవిలలాడుతున్నారు...

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు 6: దాదాపు పద కొండు నెలలుగా జీతాలు లేక జిల్లాలో రెండో విడత నియమితులైన 270 మంది గ్రామ, వార్డు వలంటీర్లు విలవిలలాడుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం వీరిని నియమించింది. అప్పటికే జారీ చేసిన పోస్టులకు ఇవి అదనం. అయితే ప్రభుత్వం తొలి విడత నియమించిన వారికే జీతాలు ఇస్తోంది. దీంతో రెండో విడత నియమితులైన వారు ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు మంగళ వారం కొందరు వలంటీర్లు జగ్గంపేట వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సమస్యను అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎటువంటి కదలిక లేదు. దీనిపై జడ్‌పీ సీఈవోను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గత ఏడాది డిసెంబర్‌లో నవశకం ఇంటింటి సర్వే కోసం అదనంగా వీరిని తీసుకోవడం జరిగిందన్నారు. అయితే గృహాల సంఖ్య తగ్గిపోవడంతో శాంక్షన్ పోస్టులు తగ్గాయన్నారు. తగ్గిన వాటిలో వీరు ఉండడంతో జీతాలు రావడం లేదన్నారు.