-
-
Home » Andhra Pradesh » East Godavari » jc rajakumari review
-
మహిళా సాధికారతే లక్ష్యంగా
ABN , First Publish Date - 2020-11-21T05:30:00+05:30 IST
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని ఆయా వర్గాలకు చేరే విధంగా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.

చేయూత పథకాన్ని చేరువ చేయాలి
జాయింట్ కలెక్టర్ రాజకుమారి
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), నవంబరు 21: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని ఆయా వర్గాలకు చేరే విధంగా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం డీఆర్‌డీఏ, లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో కలిసి వైఎస్‌ఆర్ చేయూత పథకం అమలుపై జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చేయూత పఽథకానికి 45 సంవత్సరా నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు అర్హులన్నారు. జిల్లాలో 42,591 మంది మహిళలు పాడి పశువుల కొనుగోలుకు, 9899 మంది మహిళలు మేకలు, గొర్రెల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రూ.75 వేలు విలువ గల పశువును అందించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. వాటిని కొనుగోలు చేయడానికి మొదటి విడతగా రూ 18,750 వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారన్నారు. మిగిలిన మొత్తం రూ.56,250 సంబంధిత బ్యాంక్ నుంచి విడుదల చేస్తారన్నారు. గ్రామ స్థాయిలో పాడి పశువుల కొనుగోలు, ఎంపికపై రైతు భరోసా కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ రాజకుమారి సూచించారు. పశు సంవర్ధక శాఖ జేడీ టి.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.