నేడు కలెక్టరేట్ వద్ద జనసేన నిరసన
ABN , First Publish Date - 2020-12-07T05:54:03+05:30 IST
రాష్ట్రంలో అకాల వర్షాలు, నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్ కోరారు.

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), డిసెంబరు 6: రాష్ట్రంలో అకాల వర్షాలు, నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్ తెలిపారు. జన సైనికులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. రైతులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలని, ఎకరాకు రూ.35 వేలు పరిహారం ప్రకటించాలని, కౌలు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని, అందుబాటులో ఉన్న రైతులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని నానాజీ, శశిధర్ కోరారు.