రేపు ‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-07T10:32:01+05:30 IST

మండల పరిధిలో గురువారం జగనన్న విద్యాకానుక పథకాన్ని రంగంపేట ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారని ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు...

రేపు ‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభం

రంగంపేట, అక్టోబరు 6: మండల పరిధిలో గురువారం జగనన్న విద్యాకానుక పథకాన్ని రంగంపేట ఉన్నత పాఠశాలలో  ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారని ఎంఈవో  శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రత్యేక బ్యాగుల్లో పుస్తకాలు, యూనిఫాం, బూట్లు సాక్సు వంటివాటితో సమకూర్చిన కిట్లను ఆయా పాఠశాలలకు ఇప్పటికే సరఫరా చేశామని, గురువారం నుంచి వాటిని అందిస్తామని తెలిపారు.


Read more