జగనన్న జీవ క్రాంతి పక్కాగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-11T05:58:21+05:30 IST

జిల్లాలో జగనన్న జీవక్రాంతి పథకం నూరు శాతం విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు.

జగనన్న జీవ క్రాంతి పక్కాగా అమలు చేయాలి
కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌

 కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి

డెయిరీపారమ్‌ సెంటర్‌(కాకినాడ),డిసెంబరు10: జిల్లాలో జగనన్న జీవక్రాంతి పథకం నూరు శాతం విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. మహిళా సాధికారిత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పఽథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన పథకం ప్రారంభ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, అధికారులతో కలిసి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.  అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పథకం ద్వారా జిల్లాలో 9,899 మంది మహిళలకు గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. దళలవారీగా ఈ యూనిట్లను కొనుగోలు చేయనున్నామన్నారు. ఇప్పటికే 529 యూనిట్ల గొర్రెలు, మేకల యూనిట్లు కొనుగోలు చేశామని, బ్యాంకుల సహకారంతో పఽథకాన్ని విజయవంతంగా అమలు చేయనున్నామని తెలిపారు. లబ్ధిదారులకు వైఎస్‌ఆర్‌ చేయూత కింద యూనిట్‌కు రూ.75 వేల ఆర్థిక సాయం ఉచితంగా అందుతుందన్నారు. తొలి విడతగా రూ 18,750 మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యిందని తెలిపారు. యూనిట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పఽథకం అమలు పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు. పథకం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలపాలని సూచించారు.  డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాఽథ్‌, పశు సంవర్ధక శాఖ జేడీ ఎస్‌టీ శ్రీనివాసరావు, మెప్మా పీడీ కె.శ్రీరమణి, ఎల్‌డీఏం షణ్ముఖరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:58:21+05:30 IST