ఐసోలేషన్‌ కోచ్‌లు రెడీ

ABN , First Publish Date - 2020-04-07T10:11:27+05:30 IST

కొవిడ్‌-19 రోగులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ఐసోలేషన్‌ కోచ్‌లను

ఐసోలేషన్‌ కోచ్‌లు రెడీ

కినాడలో 13 కోచ్‌లు సిద్ధం చేసిన అధికారులు

చ్‌లో 8 క్యాబిన్‌లు.. క్యాబిన్‌కు ఇద్దరు రోగులు

వసరాన్ని బట్టి ఎక్కడి కైనా తరలించేందుకు సిద్ధం

మరో రెండురోజుల్లో పూర్తికానున్న పనులు


కాకినాడ(భానుగుడి), ఏప్రిల్‌ 6: కొవిడ్‌-19 రోగులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ఐసోలేషన్‌ కోచ్‌లను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఇవి మరో రెండురోజుల్లో పూర్తిస్థాయిలో సిద్ధం కానున్నాయి. కాగా దక్షిణ మధ్య రైల్వేకు సంబందించి విజయవాడ, మచిలీపట్నం, నర్సపూర్‌తోపాటుగా కాకినాడలో ఐసోలేషన్‌ కోచ్‌లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 13 కోచ్‌లను ఐసోలేషన్‌ కోచ్‌లుగా తీర్చిదిద్దారు. ఈ స్లీపర్‌ కోచ్‌లను ఉభయగోదావరి జిల్లా యంత్రాంగాలు ఉపయోగించుకోవచ్చు. వీటిని రోగులకు అవసరమైన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. కోచ్‌లో ప్రతి క్యాబిన్‌లోనూ రెండు అప్పర్‌, రెండు లోయర్‌ బెర్తులు ఉంటాయి. రోగుల సౌకర్యార్థంగా లోయర్‌ బెర్తులను మాత్రమే ఉపయోగించుకోవాలి.


ఒక్కో కోచ్‌లో 8 క్యాబిన్‌లు ఉంటాయి. అంటే అంటే ఒక్కో కోచ్‌లో 16మంది రోగులకు చికిత్స అందించవచ్చు. ఈ లెక్కన మొత్తం 13 కోచ్‌ల్లోను 104మంది రోగులకు చికిత్స అందించవచ్చు. కోచ్‌లో ప్రతి క్యాబిన్‌లోనూ బెర్తుల పక్కనే ఆక్సిజన్‌ సిలెండర్లు ఏర్పాటు చేశారు. క్యాబిన్‌ స్ర్కీన్‌ను మూసివేసేందుకు వీలుగా పారదర్శకంగా ప్లాస్టిక్‌ షీట్లను ఉపయోగించారు. ప్రతి కోచ్‌లోనూ నాలుగు మరుగుదొడ్లు ఉంటాయి. వాటిలో నేల మెత్తగా ఉండడానికి పీసీసీ మెటీరియల్‌తో కూడిన షీట్‌ను అమర్చారు. బాత్‌రూమ్‌లో, పొడవైన ట్యాప్‌ను, ఒక హ్యాండ్‌షవర్‌, బకెట్‌, మగ్గు, సోప్‌లను ఉంచడంతోపాటుగా చేతులు కడుక్కునేందుకు ప్రత్యేక శానిటైజర్‌ను ఏర్పాటు చేశారు. త్రీపెగ్‌ కోట్‌ హుక్స్‌ రెండింటినీ ఏర్పాటు చేశారు.


కిటికీల నుంచి దోమలు రాకుండా దోమతెరలతో మూశారు. ప్రతి క్యాబిన్‌లోనూ మూడు డస్ట్‌బిన్‌లు, వీటిలో బయోడీగ్రేడబుల్‌ డిస్పాజబుల్‌, సెల్‌ఫోన్లను చార్జింగ్‌ చేసుకోవడానికి వీలుగా చార్జింగ్‌ సాకెట్స్‌ను ఏర్పాటు చేశారు. కోచ్‌లో మొదటి భాగాన్ని పారామెడికల్‌ ఏరియా, స్టోర్‌ ఏరియాలుగా ఉపయోగించుకోవచ్చు.


Updated Date - 2020-04-07T10:11:27+05:30 IST